ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార వైఎస్సార్‌సీపీ ఆవిర్బావ దినోత్వవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ ఓ రోల్ మోడల్ అని తెలిపారు. 12 ఏళ్లుగా వైఎస్ జగన్ ఆదర్శ వంతంగా పార్టీని నడుపుతున్నారని చెప్పారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అంటూ కొనియాడారు.
Also Read:YSRCP: వైఎస్ఆర్సీపీకి 13 ఏళ్లు.. ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పరిపాల చేస్తున్నారని చెప్పారు. అవినీతి లేకుండా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారన్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశంలో నే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. దేశ చరిత్రలోనే ఎవరూ చెయని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారని తెలిపారు. సచివాలయ వ్యవస్థ తో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారని చెప్పారు. మహిళలకు, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ మరొకటి లేదన్నారు. సీఎం జగన్ అధికారాన్ని బాధ్యతగా భావించి పని చేస్తున్నారని తెలిపారు. ఎంత మంది కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీని ఏమి చెయలేరని సజ్జల స్పష్టం చేశారు.