పీఆర్‌సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పలుమార్లు సమావేశమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఫిట్‌మెంట్‌పై ఓ నిర్ణయానికి రావాలని సూచించారు. ఉద్యోగులకు న్యాయపరంగా డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా సీఎం జగన్‌తో కూడా పీఆర్‌సీతో పాటు ఇతర డిమాండ్లపై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సజ్జల అన్నారు. అయితే ఇటీవల సీఎస్ సమీశ్‌శర్మ కమిటీ ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 14.29 ఇవ్వాలంటూ సీఎం జగన్ నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యం ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదక ఆమోదయోగ్యంగా లేదంటూ నిరసనలకు దిగారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు.