NTV Telugu Site icon

Sajjala: ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు.. టీడీపీకి సజ్జల సవాల్

Sajjala

Sajjala

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ.. తాజాగా ఎమ్మెల్యే కోటాలోనూ గెలుపు రాజకీయంగా ఆసక్తి రేపింది. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలుస్తుందని ఆపార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికార వైసీపీ మాత్రం టీడీపీకి అంత సీన్ లేదని చెబుతోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ.. ఓ స్థానాన్ని కోల్పోవడంతో ఆపార్టీకి నిరాశలో ఉంది. అయితే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సంఖ్యాబలం ఉంది కాబట్టే ఏడుగురు అభ్యర్థుల్ని పోటీలో పెట్టామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. డబ్బులు ఎర చూపడం వల్లే టీడీపీ ఒక స్థానంలో గెలిచిందని ఆరోపించారు. డబ్బులు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొన్నారని చెప్పారు.
Also Read: MLA Quota MLC Elections Results: సంబరాల్లో టీడీపీ శ్రేణులు.. దేవుడు స్క్రిప్ట్‌ తిరగ రాశాడు..!

గతంలోనూ అలాగే టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా అదే చేశారని సజ్జల చెప్పారు. ఈ ఒక్క గెలుపు చూసుకుని తాము ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ సవాల్‌ విసిరారు. క్రాస్ ఓటింగ్ పాల్పడ్డవారిని గుర్తించామన్నారు. సరైన సమయంలో చర్యలుంటాయని సజ్జల స్పష్టం చేశారు.

Also Read:Samantha: బహుశా.. బంగారు బొమ్మ అంటే ఇలానే ఉంటుందేమో

కాగా,ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు.చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఆమెకు అనుకూలంగా ఓటు వేసిన ఆనలుగురు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు టీడీపీకి పడినట్లు తెలుస్తోంది. అయితే, మిగత రెండు ఓట్లు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి ఖండించారు.

Show comments