NTV Telugu Site icon

Sachin Pilot : రాజస్థాన్‌ కాంగ్రెస్‌ లో చల్లారని వేడి.. కీలక సమావేశానికి పైలట్ డుమ్మా

Rajasatan Congess

Rajasatan Congess

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు కలవర పెడుతున్నాయి. అధికార కాంగ్రెస్ లో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వివాదం ముదురుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న తరుణంలో జైపూర్ శివార్లలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి గెహ్లాట్, పార్టీ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జిందర్ సింగ్ రంధావా, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గోవింద్ సింగ్ దోతస్రా ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Also Read: Today Stock Market Roundup 17-04-23: ఐటీసీ షేర్.. బెస్ట్ పెర్‌ఫార్మర్
ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ ప్రాతినిధ్యం వహిస్తున్న టోంక్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఈ రోజు షెడ్యూల్ చేయబడింది. అయితే సోలో ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లో ఉన్నందున పైలట్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. పార్టీ సమావేశాలను షెడ్యూల్ చేయడానికి ముందే పైలట్ తన కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

గత కొద్ది రోజులుగా సచిన్ పైలట్ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన దీక్షలు చేపట్టడం సంచలనమైంది. వసుంధర రాజే నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై సచిన్ పైలట్ ఒక వారం క్రితం నిరసన దీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి ఏమాత్రం సహించని విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ, వసుందరరాజే పాలనలో అవినీతిపై దర్యాప్తు చేయాలన్నారు. అవినీతిపై చర్యల తీసుకోవాలని సీఎం అశోగ్ గెహ్లాట్ ను డిమాండ్ చేశారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ చేసిన దీక్షపై పార్టీ అధిష్టానం సైతం గుర్రుగా ఉంది. అయినా సచిన్ పైలట్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు.

Also Read:Today Stock Market Roundup 17-04-23: ఐటీసీ షేర్.. బెస్ట్ పెర్‌ఫార్మర్
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ చర్చలకు పైలట్ హాజరుకావడం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పైలట్ యొక్క కార్యక్రమం ముందుగా షెడ్యూల్ చేయబడినందున ఆయన గైర్హాజరు గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వార్ రూమ్‌లో మాజీ మంత్రి రఘు శర్మ వ్యాఖ్యానించారు. అశోక్ గెహ్లాట్ సాంఘిక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.

Show comments