Site icon NTV Telugu

ప్ర‌ధాని మోడీకి పుతిన్ ఫోన్‌… దీనిపైనే చ‌ర్చ‌…

ప్ర‌ధాని మోడీకి ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఫోన్ చేశారు.  వివిధ అంశాల‌పై ఇరువురు నేత‌ల‌ను చ‌ర్చించారు.  డిసెంబ‌ర్ 6 వ తేదీన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఇండియా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  రెండు దేశాల మ‌ధ్య ఎప్ప‌టినుంచో మంచి స్నేహ‌సంబంధాలు ఉన్నాయి.  వాటిని ఇప్ప‌టికీ కొన‌సాగిస్తున్నాయి.  వాణిజ్య‌ప‌ర‌మైన ఒప్పందాల‌తో పాటుగా, ర‌క్ష‌ణ ఒప్పందాలు రెండు దేశాల మ‌ధ్య సుదీర్ఘ‌కాలంగా కొన‌సాగుతున్నాయి.  

Read: డిసెంబ‌ర్ 21, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు…

ఇటీవ‌లే ర‌ష్యా నుంచి ఇండియా ఎస్ 400 ట్యాంకుల‌ను కొనుగోలు చేసింది.  ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మ‌క సంబంధాలు మెరుగుప‌రుచుకోవాల‌ని ఇరు నేత‌లు నిర్ణ‌యం తీసుకున్నారు.  ఎరువుల స‌ర‌ఫ‌రా ఇత‌ర రంగాల్లో స‌హ‌కారంపై చ‌ర్చించామ‌ని, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌పైనా చ‌ర్చించిన‌ట్టు ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు.  

Exit mobile version