Site icon NTV Telugu

రష్యాకు మ‌రో హెచ్చ‌రిక‌…ఉక్రెయిన్‌పై దాడికి దిగితే…

ర‌ష్యా-ఉక్రెయిన్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌తలు తీవ్ర‌స్థాయిలో నెల‌కొన్నాయి.  75 వేల మంది బ‌ల‌గాల‌ను ర‌ష్యా ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో మోహ‌రించింది. ఇదే ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే ఊరుకునేది లేద‌ని ఇప్ప‌టికే అమెరికా హెచ్చ‌రించింది.  కాగా, ఇప్పుడు అమెరికా బాట‌లోనే జ‌ర్మ‌నీ కూడా హెచ్చ‌రించింది.  జ‌ర్మ‌నీ కొత్త ఛాన్స‌ల‌ర్ స్కాల్జ్ కూడా ర‌ష్యాను హెచ్చ‌రించారు.  ఉక్రెయిన్ పై ఎలాంటి యుద్ద చ‌ర్య‌లకు పాల్ప‌డినా దాని ఫ‌లితం తీవ్రంగా ఉంటుంద‌ని, ర‌ష్యా భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.  ఛాన్స‌ల‌ర్ గా ఎంపిక‌య్యాక ఆయ‌న తొలిసారి చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌సంగించారు.  

Read: ఛీఛీ నీచం.. దానికోసం సొంత చెల్లిని పెళ్లిచేసుకున్న అన్న

ఆ స‌మ‌యంలో ఆయ‌న ఈ విధ‌మైన వ్యాఖ్య‌లు చేశారు.  రెండో ప్ర‌పంచ యుద్ధం నుంచి ర‌ష్యా, జ‌ర్మనీ దేశాల మ‌ధ్య కొంత శ‌తృత్వం ఉన్న‌ది.  ర‌ష్యాను ఆక్ర‌మించుకోవ‌డానికి జ‌ర్మనీ తీవ్ర‌మైన ప్ర‌య‌త్నాలు చేసింది.  కానీ, ర‌ష్యా ఎత్తుల ముందు, బ‌ల‌గం ముందు జ‌ర్మ‌నీ నిలువలేక‌పోయింది.  రెండు దేశాల మ‌ధ్య శ‌తృత్వం ఉన్న‌ప్ప‌టికీ పైకి క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతూ వ‌స్తున్నారు.  అయితే, ఇప్పుడు ర‌ష్యా ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధ‌వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో జ‌ర్మ‌నీ శ‌తృదేశంపై విరుచుకుప‌డుతున్న‌ది.  

Exit mobile version