Site icon NTV Telugu

సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో పుతిన్‌…సైబీరియాలో ఇలా…

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాద‌మిర్ పుతిన్ ప్ర‌స్తుతం సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు.  ఆయ‌న స‌హ‌చ‌రుల్లో అనేక‌మందికి క‌రోనా సోక‌డంతో ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా ఆయ‌న సెల్ష్ ఐసోలేష‌న్‌కు వెళ్లారు.  సెర్బియా ప్రాంతంలో ఆయ‌న సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఐసోలేష‌న్ స‌మ‌యంలో పుతిన్ అక్క‌డే ఉన్న ప్ర‌వాహంలో చేప‌లు ప‌డుతూ,  అడ్వెంచ‌ర్ డ్రైవింగ్ వంటి ప్ర‌యాణాలు చేస్తున్న‌ట్టు అధ్యక్షుడి అధికార నివాసం కెమ్లిన్ తెలియ‌జేసింది.  దీనికి సంబందించిన ఫొటోల‌ను కూడా రిలీజ్ చేశారు.  గ‌తంలో కూడా పుతిన్ కొన్నిరోజులు ఐసోలేష‌న్‌లో ఉన్నారు.  ఆ స‌మ‌యంలో గ‌డ్డ‌గ‌ట్టే చ‌లిలో న‌దిలో ఈత‌కొడుతూ, హార్స్ రైడింగ్ చేస్తూ గ‌డిపారు.  2024 వ‌ర‌కు పుతిన్ ర‌ష్యాకు అధ్య‌క్షుడిగా ఉండ‌నున్నారు.  ఆ త‌రువాత ఆయ‌న ప‌ద‌వీకాలాన్ని పెంచుతూ ర‌ష్యా రాజ్యాంగాన్ని మార్చే అవ‌కాశం ఉన్న‌ది. 

Read: కోల్‌క‌తా ఓట‌రుగా ప్ర‌శాంత్ కిషోర్‌… దానికోస‌మేనా…!!?

Exit mobile version