రష్యాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతున్నది. ప్రతిరోజూ వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను రష్యా మొదటగా తయారు చేసినప్పటికీ, వ్యాక్సినేషన్ మిగతా దేశాలతో పోలిస్తే మందకోడిగా సాగుతున్నది. దీంతో కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. కట్టడి చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రికార్డ్ స్థాయిలో కేసులు పెరుగుతుండటంతో ఉద్యోగులను వారం రోజులపాటు పని ప్రదేశాలకు దూరంగా ఉంచితే మంచిదని ప్రభుత్వం భావించింది. అక్టోబర్ 30 వ తేదీ నుంచి నవంబర్ 7 వ తేదీ వరకు వారం పాటు దేశంలోని ఉద్యోగులంతా ఇంటిపట్టునే ఉండాలని, వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేసింది. ప్రజలంతా బాధ్యతతో మెలిగి వ్యాక్సిన్ వేయించుకోవాలని పుతిన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
కరోనా ఎఫెక్ట్: రష్యాలో ఉద్యోగులందరికీ వారం రోజులు సెలవులు…
