Site icon NTV Telugu

అమెజాన్‌పై ఆర్ఎస్ఎస్ కీల‌క వ్యాఖ్య‌లు… జాగ్ర‌త్త‌గా లేకుంటే…

ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌పై ఆర్ఆర్ఎస్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  అమెజాన్ కంపెనీ దేశంలో మ‌రో ఈస్ట్ ఇండియా కంపెనీగా మారేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, ఆ  కంపెనీ వ్య‌వ‌హారాలు చూస్తుంటే ఆ విధంగానే క‌నిపిస్తోంద‌ని ఆర్ఆర్ఎస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  18 వ శ‌తాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భార‌త దేశాన్ని అక్ర‌మించుకోవ‌డానికి ఆ కంపెనీ చేసిన ప‌నులే ఇప్పుడు అమెజాన్ కూడా చేస్తోంద‌ని, ప్ర‌భుత్వం తీసుకొచ్చిన విధానాల‌ను త‌మకు అనుకూలంగా మార్చుకోవ‌డానికి కోట్లాది రూపాయ‌ల ముడుపుల‌ను చెల్లిస్తోంద‌ని, త‌ద్వారా దేశంలో పాగా వేసి దేశీయ కంపెనీల‌ను దెబ్బ‌కొట్టాల‌ని, దేశంలో గుత్తాధిప‌త్యం సంపాదించాల‌ని అమెజాన్ చూస్తోంద‌ని ఆర్ఎస్ఎస్ త‌న సొంత వార‌ప‌త్రిక పాంచ‌జ‌న్య‌లో పేర్కొన్న‌ది. 

Read: ఆదివారం రాత్రి ప్ర‌ధాని స‌డెన్ విజిట్‌… షాకైన ఇంజ‌నీర్లు…

Exit mobile version