చంద్రబాబు నేటి ఉదయం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రోజా. తిరుపతిలో మీడియా ముందు చంద్రబాబు మాట్లాడిన విధానం చూస్తుంటే త్వరలోనే చంద్రబాబును పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయించాలని అందరికీ అర్థమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో భారీ వర్షాల కారణంగా సరిహద్దు ప్రాంతాలను సీఎం జగన్ అప్రమత్తం చేశారని.. అంతేకాకుండా ఆ తరువాత భారీ వర్షాలతో నష్టపోయిన జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగానే ఉండి ప్రజలకు సహాయక చర్యలు చేయాలని జగన్ కోరారని వెల్లడించారు.
Read Also :తెలుగు రాష్ట్రాల్లో ‘గంజాయి పండుగ’.. మళ్లీ మొదలైంది..
ఇలా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రారా.. ప్రజలు చచ్చిపోయాక వస్తారా.. అంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మీడియా మందుకు వచ్చి మాట్లాడుతున్నారన్నారు. వినే వారు ఉన్నారు కదా అని ఇలా మాట్లాడితే మర్యాదగ ఉండదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా సలహాలు, సహాయం ఇవ్వాలేగానీ ఈ విధంగా చేయడం కరెక్టు కాదన్నారు.