ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. మరోముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది కారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు.
శంషాబాద్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. కారులో ప్రయాణిస్తున్న 6 మంది యువకులు. మద్యం సేవించి కారు నడుపుతున్నట్లు గుర్తించారు. కారులో మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. మితి మీరిన వేగం, మద్యం మత్తులో కారు నడపడంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
కారు ముందు సీటు లో ఇరుక్కుపోయింది ఓ యువతి. చాలా కష్టం మీద యువతిని బయటకు తీశారు ఓఆర్ఆర్ సిబ్బంది. కారు నెంబర్ AP 13N 5121. కారు లో ప్రయాణిస్తున్నది 5 మంది యువకులు, ఓ అమ్మాయి. వారిని డ్రైవర్ ప్రేమ్, కాశీనాథ్, గగన్, గోశాల్, అమిత్ కుమార్, వైశ్వవిగా గుర్తించారు. ఈమధ్యకాలంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. మొయినాబాద్ లో మద్యం తాగి కారు నడిపి ఇద్దరు అమ్మాయిల మరణానికి కారణం అయ్యాడో పార్టీ నేత కుమారుడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!