NTV Telugu Site icon

రేపు హుజురాబాద్‌ కు రేవంత్‌.. సర్వత్రా ఆసక్తి..

టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్‌ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలంగాణలో అంపశయమీద ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరిపోసి, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు అహర్నిషలు కష్టపుడుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తల్లో జోష్‌ నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా బహిరంగ సభల్లో రేవంత్‌ రెడ్డి ప్రసంగించే విధానంతో కాంగ్రెస్‌ కు కరెక్టు నాయకుడు వచ్చాడని కార్యకర్తలు అంటున్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ ను అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే రేపు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం కోసం హుజురాబాద్‌ నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించారు.

రేవంత్‌ పీసీసీగా నియామకమైన తరువాత వచ్చిన మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఉప ఎన్నిక ప్రత్యేకతను సంచరించుకుంది. ఎన్నికల కోడ్‌ వచ్చిననాటి నుంచి హుజురాబాద్ లో రేవంత్‌ ప్రచారం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో రేవంత రెడ్డి రాకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శనివారం కరీంనగర్‌ నుంచి 3 గంటలకు వీణవంక చేరుకోనున్న రేవంత్‌ వీణవంక బస్టాండ్‌ ప్రాంగణంలో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం వీణవంక నుంచి జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ఇల్లందకుంటలో శ్రీరాములపల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడినుంచి కమలాపూర్‌ చేరుకొని బస్టాండ్‌ సమీపంలో ప్రచారం నిర్వహించనున్నారు.