హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జోరు పెంచింది. పీసీసీ అధ్యక్షుడు హుజురాబాద్ నియోజవకర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం జీడీపీ పెంచుతామంటే దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతారనుకున్నామని.. కానీ జీ అంటే గ్యాస్.. డీ అంటే డీజిల్.. పీ అంటే పెట్రోల్ ధరలు పెంచుతారని మేమేం ఊహించలేదంటూ బీజేపీ నేతలకు చురకలు అంటించారు. అంతేకాకుండా హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎందుకు బీజేపీకి ఓటు వేయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.
దీనితో పాటు పెట్రోట్, డీజిల్ ధరలు పెంచినందుకు, గ్యాస్ ధరలు పెంచినందుకు, వ్యవసాయ రంగాన్ని చీకటిలోకి నెట్టినందుకు బీజేపీ ఓటు వేయాలా..? అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా కోర్టులు, లోన్ల నుంచి తప్పించుకోవడానికి దొంగ నుంచి గజదొంగ దగ్గర చేరిన ఈటల రాజేందర్ ఓటు వేయాలా..? అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ ను గెలిపించాలని ఆయన కోరారు.