ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ కొత్త మొబైళ్లను మార్కెట్లలోకి తీసుకొస్తోంది. Redmi Note 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. రెడ్‍మీ నోట్ 12 సిరీస్‍లో ప్రస్తుతం మూడు మోడల్స్ ఉన్నాయి. రెడ్‍మీ నోట్ 12 5జీ, రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ లభిస్తున్నాయి. కొత్తగా రెడ్‌మి నోట్ 12 4Gని ప్రకటించింది. రెడ్‍మీ నోట్ 12 సిరీస్‍లో త్వరలో మరో రెండు మోడల్స్ చేరే అవకాశం ఉంది. Redmi Note 12 4G మినహా అన్ని మోడళ్లు అందుబాటులోకి ఉన్నాయి. మార్చి 30న భారతదేశంలో Redmi Note 12 4G ఫోన్లు అందుబాటులో ఉంటాయి.
Also Read:Manchu Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన సారథి.. అసలు ఎవరితను..?
రెడ్‍మీ నోట్ 12 4జీ ఫోన్‍ను ఈనెల 30వ తేదీన లాంచ్ చేయనున్నట్టు షావోమీ అధికారికంగా ప్రకటించింది. షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ సందర్భంగా ఈ మొబైల్‍ను తీసుకొస్తున్నట్టు తెలిపింది. అమోలెడ్ డిస్‍ప్లే, స్టైలిష్ డిజైన్ ఈ మొబైల్‍కు హైలైట్‍గా ఉన్నాయి. Redmi Note 12 ధర రూ. 17,700తో ప్రారంభం అవుతుంది. 4GB + 64GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర దాదాపు రూ. 20,400గా నిర్ణయించారు. అదే సమయంలో 4GB + 128GB వేరియంట్ ధర రూ.22,200గా నిర్ణయించారు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది.
Also Read:AP Assembly: ఐదు బిల్లులు, రెండు కీలక తీర్మానాలకు ఆమోదం..
120 హెర్ట్జ్ (Hz) స్క్రీన్ రిఫ్రెష్ రేష్ ఉండే సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతో రెడ్‍మీ నోట్ 12 4జీ మొబైల్‍ను తీసుకొస్తోంది షావోమీ. స్నాప్‍డ్రాగన్ 685 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. రెడ్‍మీ నోట్ 12 4జీ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకునే ఫీచర్‌ను కూడా షావోమీ అందిస్తోంది. ఈ ఫోన్ ఐస్ బ్లూ, మింట్ బ్లూ, ఓనిక్స్ గ్రే కలర్ ఆప్షన్‌లలో మార్కెట్‌లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.