టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ఈడీ కార్యాలయానికి చేరుకున్న రవితేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తారలంతా వరుసగా ఈడీ ముందు హాజరవుతున్నారు. ఈ రోజు ఈడీ విచారణకు రవితేజ వంతు వచ్చింది. గెస్ట్ హౌజ్ నుండి బయల్దేరిన రవితేజ తో పాటు అతని డ్రైవర్ శ్రీనివాస్ విచారణకు ఈడి ముందు హాజరయ్యారు. 2017లో ఎక్సైజ్ కేసులో రవితేజ విచారణ ఎదుర్కొన్నాడు. 10 గంటలు విచారించిన ఎక్సైజ్ అధికారులతో ఆయన డ్రగ్స్ కి అలవాటు పడ్డ తన తమ్ముళ్లనే దూరం పెట్టాను అంటూ అప్పట్లో వివరణ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఈరోజు మరోసారి ఈడీ ఆయనను విచారించనుండగా, బ్యాంక్ స్టేట్మెంట్, రికార్డ్స్ తో సరిగ్గా 10 గంటలకు ఈడీ ముందుకు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ తో సహా వచ్చారు.
నవదీప్ ఎఫ్ క్లబ్ చుట్టూ కేసు
నవదీప్ కి చెందిన ఎఫ్ క్లబ్ ఈ డ్రగ్స్ కేస్ తిరుగుతోంది. బుధవారం 8 గంటల పాటు రానా విచారణ సాగింది. ఈ కేసులో మొత్తం 5 మంది నటులను ఈడీ విచారించింది. ఇప్పటి వరకు పూరి, ఛార్మీ, రకుల్, నందు, రానా లు విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేస్ ప్రధాన నిందితుడు కెల్విన్ సైతం నేడు విచారణకు హాజరు కావాలని, విచారణ పూర్తి అయ్యే వరకు రావాలని అధికారుల ఆదేశించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
గెస్ట్ హౌస్ నుండి ఈడి విచారణకు !
ఈడీ విచారణకు వరుసగా హాజరవుతున్న సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తమ ఇళ్ల నుంచి కాకుండా గెస్ట్ హౌస్ ల నుంచి వస్తుండడం గమనార్హం. పూరీ, ఛార్మీ, రానా లు హోటల్ నుండి ఉండీ కార్యాలయానికి రాగా రకుల్ గెస్ట్ హౌస్ నుండి చేరుకుంది. రవితేజ సైతం ఈడి ఆఫీసుకు ఇంటి నుండి కాకుండా ఫాంహౌస్ నుండి బయల్దేరాడు. పైగా వీరంతా మీడియా కంటపడకుండా ఈడి కార్యాలయానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!