టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవ్‌గన్, ఒలివియా మోరిస్, సముతిరకని, శ్రియ శరన్ తదితరులు నటిస్తున్నారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది అక్టోబర్ 13 న థియేటర్లలో విడుదల కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ పాత్ర కొమరం భీం ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక రికార్డు రేటుకి ‘ఆర్ఆర్ఆర్’ సాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఏకంగా 325 కోట్లకు జీ5 డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ‘ట్రిపుల్ ఆర్’ రైట్స్ స్వంతం చేసుకుంది. దీంతో ఆ క్రెడిట్ తమ హీరోదేనంటూ ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య అగ్లీ సోషల్ మీడియా వార్ నడిచింది. ఎన్టీఆర్ అభిమానులు చరణ్ కు వ్యతిరేకంగా, చరణ్ అభిమానులు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా #FanBaselessRamCharan, #FanBaselessNTR అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఇండస్ట్రీలో చరణ్, తారక్ మంచి ఫ్రెండ్స్. అయితే వారి అభిమానులు మాత్రం బద్ద శత్రువులుగా తయారవ్వడం గమనార్హం.