కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ… దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన పై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ స్పందించారు. తమ పోరాటం ఇప్పుడే ఆపేయమని స్పష్టం చేశారు. ఈ రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్ లో రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగు తుందని తెలిపారు.
అలాగే… కనీస మద్దతు ధర గురించి… ప్రభుత్వం రైతులతో చర్చించాలని డిమండ్ చేశారు రాకేష్ టికాయత్. కాగా… ఇవాళ జాతిని ఉద్దేశించి… ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంగించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు.
