NTV Telugu Site icon

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి : రఘురామరాజు

MP Raghu Ramakrishna

శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థంగా ఉందని ఆయన లోక్‌ సభలో ప్రస్తావించారు. ఏపీలో రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఉద్యోగులకు కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఆదాయం సృష్టించే మార్గాలను మరిచి రుణాలపైనే ఆధారపడుతోందని ఆయన అన్నారు. దీంతో ఏపీ ఆర్ధిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఏపీలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయని, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరారు.