ఇండియాలో భారీ తగ్గిన కరోనా కేసులు

మనదేశలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 18,346 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,853,048 కు చేరింది. దేశంలో 2,52,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 29, 639 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.93 శాతంగా ఉంది. అటు కేరళ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8850 కరోనా కేసులు నమోదు కాగా… 149 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

-Advertisement-ఇండియాలో భారీ తగ్గిన కరోనా కేసులు

Related Articles

Latest Articles