Site icon NTV Telugu

ప్రియాంక‌ను అడ్డుకున్న పోలీసులు… యూపీలో ఉద్రిక్త‌త‌…

ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌న‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.  రైతుల‌కు మ‌ద్ధ‌తుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలిపింది.  ల‌ఖింపూర్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్తుండ‌గా ఆమెను అడ్డుకొని రెండు రోజుల‌పాటు గెస్ట్‌హౌస్‌లో ఉంచారు.  ప్రియాంక‌గాంధీ గెస్ట్ హౌస్‌లో నిర‌స‌న‌లు నిర‌స‌లు తెలియ‌జేసింది.  పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు రావ‌డంతో ల‌ఖింపూర్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు పోలీసులు ప్రియాంక గాంధీకి అనుమ‌తులు ఇచ్చారు.  కాగా, ఇప్పుడు మ‌రోసారి ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.  ఆగ్రా ప‌రిధిలోని జ‌గ‌దీష్ పురా పోలీస్ స్టేష‌న్‌లో అరుణ్ అనే వ్య‌క్తిని పోలీసులు ఇంట‌రాగేష‌న్ చేస్తుండ‌గా అనారోగ్యానికి గురై మృతి చెందాడు.  మృతి చెందిన అరుణ్ కుటంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు ప్రియాంక‌గాంధీని అడ్డుకున్నారు పోలీసులు.  అనుమ‌తులు లేవ‌ని, అనుమ‌తి లేకుండా వెళ్లేందుకు వీలు లేద‌ని పోలీసులు చెప్ప‌డంతో ప్రియాంక గాంధీ  మండిప‌డ్డారు.  తాను ఎక్క‌డి వెళ్లినా పోలీసుల‌కు చెప్పి, అనుమ‌తులు తీసుకొని వెళ్లాలా అని ప్ర‌శ్నించారు.  కాంగ్రెస్ పార్టీ పోలీసుల తీరుపై మండిప‌డింది.  దీంతో ఆ యూపీలో మ‌ళ్లీ ఉద్రిక‌త్త‌లు మొద‌ల‌య్యాయి.  

Read: యాదాద్రికి విరాళాల వెల్లువ

Exit mobile version