NTV Telugu Site icon

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర

Gold Price

Gold Price

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పరుగెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెండి, వెండి ప్రియులకు ఊరట లభించింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర 10 గ్రాములకు రూ.210 మేర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 మేర దిగివచ్చింది. ప్రస్తుతం హైదారాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 మేర తగ్గడంతో రూ.54, 500కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.240 తగ్గుదలతో రూ.59, 450గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. రూ.59,450 ఉంది.

Also Read:CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ!

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54, 650గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59, 600 కి పడిపోయింది. మరోవైపు ఇవాళ వెండి ధర కూడా తగ్గింది. వెండి ధర రూ.300 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,700 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,110గా నమోదైంది. కోల్‌కతా 22 క్యారెట్ ధర 10గా ఉంది. 54,500, 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.59,450కి చేరింది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.54,550, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.59,500 వద్ద కొనసాగుతోంది. కేరళలో 10 గ్రాముల క్యారెట్లు రూ.54,500, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.59,450గా ఉంది.

Also Read: Regina Cassandra: పచ్చని చెట్ల మధ్య పూల పూల డ్రెస్ లో పువ్వులా మారిందే

ఇక, వెండి విషయానికి వస్తే..ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000గా ఉంది. ముంబైలో వెండి కిలో రూ.73,000, చెన్నై రూ.75,700, బెంగళూరు రూ.75,700, కేరళ రూ.75,700, కోల్ కతా రూ.73,300, హైదరాబాద్ రూ.75,700, విజయవాడ రూ.75,700, విశాఖపట్నం రూ. .75,700గా ఉంది.

ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. కొనుగోలు చేయడానికి ముందు ధరలను తనిఖీ చేయడం మంచిది.

Also Read:Mexico-US Border: మెక్సికో-యూఎస్ బోర్డర్ లో ఘోర అగ్ని ప్రమాదం.. 39 మంది శరణార్ధుల మృతి