Site icon NTV Telugu

హాట్ టాపిక్: కాంగ్రెస్ లోకి ప్రశాంత్ కిషోర్!

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు నేషనల్ వైడ్ గా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా సోనియా గాంధీ కుటుంబంతో మంగళవారం సమావేశమయ్యారు. అయితే ఈ మీటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి చ‌ర్చించిన‌ట్లు అంత అనుకున్నారు. కాగా, తాజా సమాచారం మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి వస్తే సరైన గుర్తింపు.. హోదా ఇస్తామంటూ ప్రశాంత్ కిషోర్ కు ఆఫర్ చేసినట్లు సమాచారం. సక్సెస్ ఫుల్ ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం.. ఇక నుంచి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన ప్రముఖ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశం ఉండొచ్చుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Exit mobile version