Site icon NTV Telugu

ప్ర‌శాంత్ కిషోర్ ఎటువైపు…

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ గ‌త కొంత‌కాలంగా కాంగ్రెస్ లో చేర‌బోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.  ఈ వార్త‌లకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న కాంగ్రెస్ లో చురుకైన పాత్ర‌ను పోషిస్తూ వ‌చ్చారు.  అయితే,  పంజాబ్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన త‌రువాత కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఏర్ప‌డ్డాయి.  బెంగాల్ ఎన్నిక‌ల త‌రువాత ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా విధులు నిర్వ‌హింబోన‌ని చెప్ప‌డంతో ఆయ‌న కాంగ్రెస్ చేరుతారనే వార్త‌లు వినిపించాయి.  అయితే, కాంగ్రెస్‌లో కొంత‌మంది పెద్ద‌లు ప్ర‌శాంత్ కిషోర్ ను ఎన్నిక‌ల వ్యూహాల వ‌ర‌కే ప‌రిమితం చేయాల‌ని, పార్టీలో ఇన్వాల్వ్ చేయ‌కూడ‌ద‌ని పార్టీ పెద్ద‌లు పేర్కొన‌డంతో కొంత వెన‌క్కి త‌గ్గారు. వెస్ట్ బెంగాల్ ఎన్నిక‌ల త‌రువాత తృణ‌మూల్ కాంగ్రెస్ తో ఒప్పందాన్ని మ‌రో ఐదేళ్లు పొడిగించుకోవ‌డంతో పాటుగా భ‌వానీపూర్ ఒట‌రుగా పేరు న‌మోదు చేసుకోవ‌డంతో తృణ‌మూల్ కాంగ్రెస్‌లో ప్ర‌శాంత్ కిషోర్ కీల‌క పాత్ర పోషిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నారు.   అంతేకాకుండా, ప్ర‌శాంత్ కిషోర్ దేశంలోని వివిధ పార్టీల‌కు ప్ర‌స్తుతం వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ఒప్పందాలు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.  

Read: ట్రూత్ సోష‌ల్ పేరుతో ట్రంప్ సొంత మీడియా…

Exit mobile version