Site icon NTV Telugu

అఫిషియల్ : “ప్రభాస్ 25” టైటిల్ అనౌన్స్మెంట్

Prabhas 25 official Announcement

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే “ప్రభాస్ 25” అప్డేట్ నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 7న ప్రకటిస్తామని టి సిరీస్ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటలకు “ప్రభాస్ 25” ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన వివరాలతో పాటు టైటిల్ ను కూడా రివీల్ చేసింది.

Read Also : ఆదిపురుష్ : లక్ష్మణుడి బర్త్ డే వేడుకల్లో టీం

ఈ సినిమాకు “స్పిరిట్” అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. యూవీ క్రియేషన్స్, టి సిరీస్ తో కలిసి భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను రూపొందించనుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా, భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, కృష్ణ కుమార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి రెబల్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మొదటి ప్రకటనతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు. హీరోయిన్, మిగతా నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Exit mobile version