NTV Telugu Site icon

హుజురాబాద్ లో ముగిసిన పోలింగ్

రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతతో ఎదురుచూసిన హుజురాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. కోవిడ్ పేషెంట్ల, లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్‌ సమయం ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. అయితే చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్‌ ముగిసింది.

అంతేకాకుండా ఈవీయంలకు ఎన్నికల సిబ్బంది సీల్ వేస్తున్నారు. అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 76.26 పోలింగ్ శాతం నమోదు అయ్యింది. పోలింగ్‌ అనంతరం ఈవీయంలను కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో ఏర్పాట చేసిన స్ట్రాంగ్‌ రూంకు భారీ భద్రత నడుమ తరలించనున్నారు.

నవంబర్‌ 2న కౌటింగ్‌ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి 86.40శాతం పోలింగ్ నమోదు అయ్యిందని, ఇంకా 20,223,224,237 పోలింగ్ బూతులో లో పోలింగ్ కొనసాగుతోందని చీఫ్ ఎలక్ట్రోరల్ శశాంక్ గోయల్ వెల్లడించారు.