ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ధ భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులంటా దిల్‌షుఖ్ నగర్ రావాలని, దిల్‌షుఖ్ నగర్ లో సాయంత్రం 4 గంటల నుంచి ఎలాగైనా ర్యాలీని చెపట్టితీరుతామని రేవంత్ ప్రకటించారు. ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెప్పారు. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైను రేవంత్ రెడ్డి ఇంటి వద్ధ 100 మంది పోలీసులను మోహరించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రగతి భవన్ వైపు కూడా వెళ్లే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read: పవన్ సంచలన వ్యాఖ్యలు… తాను ఈ యుద్ధంలో చనిపోతే…