ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు… తాను ఈ యుద్ధంలో చ‌నిపోతే…

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు రాజ‌మండ్రిలో జ‌రిగిన స‌భ‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  త‌న‌కు రాజ‌కీయాలంటే స‌ర‌దా కాద‌ని, ఒక బాధ్య‌త‌గా తీసుకున్నాన‌ని చెప్పారు. అంద‌రిని క‌లుపుకొని పోవాల్సిన అవ‌న‌సం ఉంద‌ని అన్నారు ప‌వ‌న్‌.  క‌మ్మ‌ల‌కు వ్య‌తిరేకం కాద‌ని చెప్పేందుకే తాను 2014లో టీడీపికి మ‌ద్ధ‌తు ఇచ్చాన‌ని, అయితే, ఇప్పుడు టీడీపీ స‌త్తా స‌రిపోవ‌డం లేద‌ని, అందుకే తాను రంగంలోకి దిగాల్సి వ‌చ్చింద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.  బీజేపీ కార్య‌కర్త‌ల‌ను కూడా వైసీపీ నేత‌లు వ‌ద‌ల‌డంలేద‌ని అన్నారు.  యుద్ధం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని, ఈ యుద్ధంలో తాను చ‌నిపోతే దేశం న‌లుమూల‌లా పిడిక‌డు మ‌ట్టి వేయాల‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.   ప్ర‌భుత్వం జ‌న‌సైనికుల‌ను అడ్డుకోకుంటే సుమారు ల‌క్ష‌మందితో స‌భ జ‌రిగేద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.  

Read: అందుకే టీడీపీకి మ‌ద్ద‌తిచ్చాను…

-Advertisement-ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... తాను ఈ యుద్ధంలో చ‌నిపోతే...

Related Articles

Latest Articles