Site icon NTV Telugu

AIIMS in Guwahati: ఈశాన్య రాష్ట్రాల మొదటి ఎయిమ్స్‌.. అస్సాంలో ప్రారంభించిన మోడీ

Modi Assam

Modi Assam

అస్సాం బిహు పండుగను జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గౌహతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో ఎయిమ్స్ గువాహటిని ప్రధాని ప్రారంభించారు. ఎయిమ్స్ క్యాంపస్‌ను రూ.1,123 కోట్లతో నిర్మించారు. మొత్తం ఈశాన్య ప్రాంతంలో ఎయిమ్స్ ఉంది ఇది ఒక్కడటే. ఈ భవనానికి 2017లో ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేశారు. నల్బారి, నాగోన్, కోక్రాఝర్‌లలో మూడు వైద్య కళాశాలలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

అంతకుముందు.. సీఎం హిమంత బిస్వా శర్మ లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. బిహును జరుపుకోవడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అంటూ బిస్వా శర్మ ట్వీట్ చేశారు.

వేడుకలో హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, 1.1 కోట్ల ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. రాబోయే ఒకటిన్నర నెలల్లో ఈ సంఖ్య 3.3 కోట్లకు పెరుగుతుందని చెప్పారు.ఈ కార్డులతో లబ్ధిదారులు ఐదు లక్షల రూపాయల వరకు నగదు రహిత ఆరోగ్య సంరక్షణ వైద్య చికిత్స ప్రయోజనాలను పొందగలుగుతారని తెలిపారు.
Also Read:Kotamreddy Sridhar Reddy: సీఎం జగన్‌కు థాంక్స్ చెప్పిన కోటంరెడ్డి.. ఎందుకంటే..?

కాగా, రాష్ట్ర వసంతోత్సవం సందర్భంగా అస్సాం పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రూ. 14,300 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను అంకితం చేస్తారు. ఐఐటి-గౌహతి , రాష్ట్ర ప్రభుత్వం మధ్య సహకారంతో అస్సాం అడ్వాన్స్‌డ్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్‌కు కూడా ప్రధాని పునాది వేస్తారు. నామ్‌రూప్‌లో మెగా 500-టిపిడి మిథనాల్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. గౌహతి హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా జరిగే కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు.

Exit mobile version