Rozgar Mela : 71 వేల మందికి ఉద్యోగాలు.. అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 10 లక్షల ఉద్యోగాలను అందజేస్తామని కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటనలో భాగంగా ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. దాదాపు 71 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. రోజ్‌గార్ మేళా 2023లో ప్రధాని ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన మొత్తం 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు.
Also Read:Karnataka Elections: సంకీర్ణం దిశగా కర్ణాటక.. పీపుల్‌పల్స్ ప్రీపోల్ సర్వే
చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కిందకి వెళ్తుందన్నారు. దేశంలో వివిధ రంగాలు అభివృద్ది చెందుతున్నాయని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. స్టార్ట్ అప్స్, డ్రోన్ టెక్నాలజీ, క్రీడలు, స్టేడియంలు, అకాడమీలు పెరుగుతునన్నాయన్నారు. మన దేశ తయారీ దారులను ఒకప్పుడు విశ్వసించ లేదన్నారు. ఇప్పుడు విదేశాలకు ఆయుధాలు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. సెల్ ఫోన్ తయారీ ఇక్కడే జరుగుతుందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులు ఇక్కడే తయారు చేస్తున్నామని, దీంతో ఉపాధి అవకాశాలు పెరిగాయని మోడీ వివరించారు.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
Also Read:Siddarth Madhavan: ఈ కాంబినేషన్ లో సినిమా అంటే మాములుగా ఉండదు
ఓడరేవుల రంగం అభివృద్ధి చెందుతోందని చెప్పిన మోడీ… ఉపాధి కల్పనకు ఆరోగ్య రంగం కూడా అత్యుత్తమ ఉదాహరణగా మారుతోందని వెల్లడించారు. ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో వ్యవసాయ యాంత్రీకరణ పెరిగి గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు పెరిగాయని ప్రధాని మోడీ అన్నారు. 2014 వరకు భారతదేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే, ఇప్పుడు 148 విమానాశ్రయాలు ఉన్నాయి. విమానాశ్రయాల పెరుగుదల కారణంగా, కొత్త ఉపాధి అవకాశాలు కూడా తెరవబడ్డాయి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Addressing the Rashtriya Rozgar Mela. Congratulations to the newly inducted appointees. https://t.co/t5vjjZfkBn
— Narendra Modi (@narendramodi) April 13, 2023
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!