పవిత్ర గంగానది పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. రేపటి(ఏప్రిల్ 22) నుంచి మే 3వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఏప్రిల్ 22 నుండి మే 3 వరకు జరిగే గంగా పుష్కరాలు జాతరను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. వర్చువల్ పుష్కరాలను ప్రారంభించిన అనంతరం ప్రసంగించే అవకాశం ఉంది. గంగా పుష్కరాలు గంగానదీ తీరం వెంబడి ఉండే పవిత్ర పుణ్యక్షేత్రాలతో జరుగుతాయి. గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్ నాథ్, వారణాసి, అలహాబాద్ లలో జరుగుతాయి. 12 ఏళ్ల తర్వాత పవిత్ర గంగానది తీరాన జరగనున్న పుష్కరాల సందర్భంగా వివిధ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి.
Also Read:Al-Qaeda Threatens: అతిక్ అహ్మద్ హత్య.. భారత్‌పై దాడులకు అల్-ఖైదా ప్లాన్!
గంగానది వెంబడి ఉన్న ప్రధాన మత కేంద్రాలు, ముఖ్యంగా కాశీ హరిద్వార్, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా నుండి లక్షలాది మంది తెలుగు మాట్లాడే ప్రజలు పండుగకు వస్తారు. ఈ 12 రోజుల పుష్కర కాలంలో గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం, కర్మకార్యాలు నిర్వహించడం, ఇతర ఆచారాలు పాటిండచం ఎఎంతో పుణ్యం అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. రాబోయే 12 రోజుల గంగా పుష్కరాల ఉత్సవాల దృష్ట్యా, ఏర్పాట్ల నిర్వహణ కోసం KSTS ఇటీవల గంగా పుష్కరాల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అధ్యక్షుడిగా జీవీఎల్ నర్సింహారావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ కాశీ తెలుగు సమితి అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు గంగా పుష్కరాలు ఉత్సవాలకు హాజరు కావాలని ప్రధానిని ఆహ్వానించారు. ఇక, గంగా పుష్కరం పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) తెలంగాణలోని వివిధ ప్రాంతాల కోసం ఏప్రిల్ 22 నుంచి మే 9 మధ్య 18 ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది.