Site icon NTV Telugu

ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న అత్య‌వ‌స‌ర స‌మావేశం…దీనిపైనే చ‌ర్చ‌…

ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న ఈరోజు ఉద‌యం 10:30 గంట‌ల‌కు అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నారు.  ఈ సమావేశంలో ఆరోగ్య‌శాఖ మంత్రి, కీల‌క అధికారులు హాజ‌రుకాబోతున్నారు.  క‌రోనా కొత్త వేరియంట్ పై వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో దీనిపైనే కీల‌కంగా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది.  ద‌క్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి.  ఈ వేరియంట్ లో 32 మ్యూటేష‌న్లు ఉన్న‌ట్టు ఇప్ప‌టికే ప‌రిశోధ‌కులు తెలిపారు.  

Read: 63శాతం పెరిగిన ట‌మోటా ధ‌ర‌లు… ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ‌కు…

డెల్టా వేరియంట్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది కావ‌డంతో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి.  ప‌లు దేశాలు ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు విధించారు.  వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై ఈరోజు ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న చ‌ర్చించ‌బోతున్నారు.  కొత్త వేరియంట్‌తో పాటుగా వ్యాక్సినేష‌న్‌పై కూడా చ‌ర్చించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.  

Exit mobile version