Site icon NTV Telugu

ఆగని బాదుడు.. ఈరోజు కూడా పెరిగిన పెట్రోల్ ధర

పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు ఇప్పట్లో బ్రేక్ పడే దాఖలాలు కనిపించడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఎలా ఉన్నా… దేశీయ మార్కెట్‌లో మాత్రం పరుగులు పెడుతున్నాయి. రోజూవారీ ధరల పెంపు కారణంగా పెట్రోల్ ధరలు అడ్డూ, అదుపు లేకుండా పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. శనివారం పెట్రోల్ ధర 36 పైసలు పెరగడంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.36కి చేరింది. అటు డీజిల్ ధర 38 పైసలు అధికం కావడంతో లీటర్ డీజిల్ ధర రూ.106.60కి చేరుకుంది.

Read Also: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.99గా పలుకుతోంది. డీజిల్ ధర రూ.97.72గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.114.81గా ఉండగా.. డీజిల్ ధర రూ.105.86గా నమోదైంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.109.46, డీజిల్ రూ.100.84గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.105.74, డీజిల్ రూ.101.92గా పలుకుతోంది. కాగా ఈనెలలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది 21వ సారి కావడం గమనార్హం.

Exit mobile version