దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ప్రతిరోజు పెరుగుతున్న వేళ ఉపశమనం కలిగించింది కేంద్రం. దీపావళి వేళ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించడంతో ధరలు దిగివచ్చాయి. ఈ తగ్గింపు ధరలు గురువారం ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి.
ఇదిలా వుంటే.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధరలు తగ్గించాయి. పెట్రోల్, డీజిల్ పై విధించే వ్యాట్ తగ్గించాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు.
ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ రాష్ట్రం 2 రూపాయల వ్యాట్ తగ్గించింది. దీంతో అక్కడ పెట్రోల్ ధరలు లీటరుకి 7 రూపాయలు తగ్గాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మేం కూడా తలవొగ్గాం. అందుకే కేంద్రం 5 రూపాయలు తగ్గిస్తే.. మేం లీటరుకి 2 రూపాయలు తగ్గించామని ఉత్తరాఖండ్ మంత్రి పుష్కర్ సింగ్ తెలిపారు. దీంతో లీటరుపై 7 రూపాయలు తగ్గింపు లభిసుందన్నారు.
కర్నాటక
కర్నాటకలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ పై 7 రూపాయలు తగ్గించామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.
హర్యానా
హర్యానా ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించింది. రాష్ట్రం నిర్ణయంతో చమురుధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ లీటరుకి 12 రూపాయలు తగ్గింది. కేంద్రం సూచన మేరకు ధరలు తగ్గించామని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
అసోం
అసోంలో పెట్రోల్, డీజిల్ పై 7 రూపాయల వ్యాట్ తగ్గించామని ప్రభుత్వం తెలిపింది. గత నెలలోనూ తాము ధరలు తగ్గించామని, రాష్ట్ర ప్రభుత్వం వాటా తగ్గినా సామాన్యులను పరిగణనలోకి తీసుకుని వ్యాట్ తగ్గించినట్టు సీఎం హేమంత్ బిశ్వ శర్మ తెలిపారు.
గోవా
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మిగతా రాష్ట్రాల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ 7 రూపాయలు తగ్గించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు గోవా సీఎం.
త్రిపుర
చమురు ధరల తగ్గింపు విషయంలో త్రిపుర ముందుంది. పెట్రోల్ పై 12, డీజిల్ పై 17 రూపాయల తగ్గింపు అమలులోకి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. కేంద్రం 5 రూపాయలు పెట్రోల్ పై తగ్గిస్తే త్రిపుర మరో 7 రూపాయలు తగ్గించింది. అదేవిధంగా డీజిల్ పై 10 రూపాయలు కేంద్రం తగ్గిస్తే త్రిపుర మరో 7 రూపాయలు తగ్గించింది.
యూపీ
ఉత్తర ప్రదేశ్ కూడా పెట్రోల్ డీజిల్ ధరలపై పన్ను తగ్గించింది. డీజిల్, పెట్రోల్ ధరలు లీటరుకి 12 రూపాయలు తగ్గుతాయని, ఇది సామాన్యులకు దీపావళి కానుక అని ప్రభుత్వం పేర్కొంది.
గుజరాత్
బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ కూడా తగ్గింపు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ పై గుజరాత్ సర్కార్ 7 రూపాయలు తగ్గించింది. ఇది కేంద్రం తగ్గించదానికి అదనం.
మణిపూర్
పెట్రోల్, డీజిల్ పై మణిపూర్ సర్కార్ లీటరుకి 7 రూపాయలు తగ్గించింది. దీంతో పెట్రోల్, డీజిల్ మరింత చౌకగా లభించనుంది.కేంద్రం నిర్ణయాన్ని తాము ఘనంగా స్వాగతిస్తున్నాయని సీయం బీరేన్ సింగ్ పేర్కొన్నారు.
సిక్కిం
సిక్కిం సీెం ప్రేం సింగ్ తోమర్ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు 7 రూపాయలు తగ్గిస్తున్నాయని తెలిపారు. దీంతో పెట్రోల్ పై 12 రూపాయలు, డీజిల్ పై 17 రూపాయలు ధర తగ్గుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వచ్చాయి. ఢిల్లీలో గతంలో 110.04 రూపాయలు వున్నా పెట్రోల్ ధర 103.97 పైసలకు తగ్గింది. దీంతో వినియోగదారులకు 6.07 పైసలు తగ్గినట్టయింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పెట్రోల్ బంకుల్లో డీజిల్ ధర 98.42 రూపాయల నుంచి తగ్గింపు ధరలతో 86.67 పైసలకు తగ్గింది. ముంబైలో 5.87 పైసలు తగ్గింది. డీజిల్ ధర 12.48 పైసలు తగ్గడంతో 94.14 రూపాయలకు పడిపోయింది. కోల్ కతాలోనూ తగ్గింపు కనిపిస్తోంది. కోల్ కతాలో డీజిల్ 5.82 తగ్గడంతో లీటరు పెట్రోల్ 104.67కి తగ్గింది. అలాగే, డీజిల్ 11.77 పైసలు తగ్గి లీటర్ 89.79 రూపాయలకు పడిపోయింది. ఇటు చెన్నైలో పెట్రోల్ రేటు లీటరుకి 5.26 తగ్గింది. దీంతో 101,40 గా పెట్రోల్ ధర నమోదైంది. డీజిల్ 11.16 రూపాయలు తగ్గడంతో లీటర్ 91.43గా నమోదైంది.
