NTV Telugu Site icon

కష్టపడితే.. మీ ఇంటికే బీ ఫామ్ తీసుకొస్తా..!

యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్‌ లాంటి నాయకులను కూడా యూత్ కాంగ్రెస్ అందించిందన్న ఆయన.. యూత్ కాంగ్రెస్ వాళ్లు టికెట్ల అడిగే ముందు… ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏం కొట్లాడినరో చూస్తాం అన్నారు.. టికెట్‌ తీసుకుని జనంలోకి పోతా అంటే… ఓడిపోతారు అని హితవుపలికిన రేవంత్‌రెడ్డి.. పోటీ చేసి ఓడిపోతే బాల్య వితంతులుగా మారిపోతారని.. చేతికి మట్టి అంటకుండా యూత్ కాంగ్రెస్ నాయకుడిని అంటే ఎవరూ పట్టించుకోరని స్పష్టం చేశారు.

ఇక, మీరు కష్టపడితే.. మీ ఇంటికే బీ ఫామ్ తీసుకొచ్చి ఇస్తానన్నారు రేవంత్‌రెడ్డి.. రానున్న 20 నెలల్లో కష్టపడినదానిని బట్టే టికెట్ల ఇస్తాం అన్నారు.. లేదంటే టికెట్ల ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టేశారు పీసీసీ చీఫ్‌.. నేను జిల్లా అధ్యక్షుడిని… టికెట్ ఇవ్వండి అంటే ఇచ్చేది లేదు.. పని చేసి టికెట్లు అడగాలని పేర్కొన్న రేవంత్‌రెడ్డి.. మీద మీద రాజకీయాలు చేస్తా అంటే టికెట్లు రావన్నారు.. సైనికుడిగా కొట్లాడితే టికెట్ల వాటంతట అవే వస్తాయన్న ఆయన.. నిర్ణయాలు పీసీసీ చేసినా… ఓట్లు వేయించే బాధ్యత యూత్ కాంగ్రెస్ దే అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది.. క్రైసిస్‌లో ఉన్నప్పుడే లీడర్స్‌ పుట్టుకొస్తారని.. మీరు లీడర్స్ గా మారే అవకాశం వచ్చిందన్నారు. పోరాటం ఎలా చేయాలో మీరు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.

Show comments