రాజమండ్రిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపితే తనను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. కులాల పేరిట రాజకీయాలు చేయడం తగదని, ఒక వర్గాన్ని శతృవుగా చూడడం భావ్యం కాదని పవన్ పేర్కొన్నారు. జనసేన అంటే వైసీపీకి భయం ఉందని, దానికి ఇలాళ జరిగిన సంఘటనలే ఉదాహరణలు అని అన్నారు. సభకు వస్తున్న వారిని ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుందని అన్నారు. తాను 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు. కోపాన్ని దాచుకోవడం అన్నది ఒక కళ అని, రాయలసీమలో కోపాన్ని మూడు తరాలపాటు దాచుకుంటారని, మనలో దాచుకున్న కోపాన్ని అన్యాయం చేసిన వాడి వెన్నులో వణుకుపుట్టించేలా పోరాటం చేయాలని అన్నారు. కమ్మలకు తాను వ్యతిరేకం కాదని, ఇది తెలియజేప్పేందుకే తాను 2014లో తెలుగుదేశం పార్టీకి మద్ధతు ఇచ్చానని, కాపు, తెలగ, ఒంటరి, బలిజ తదితరులు ముందుకొచ్చి పోరాటం చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, సమాజంలో మార్పు రావాలని, ఆ మార్పు గోదావరి జిల్లాలపై ఆధారపడి ఉంటుందని పవన్ పేర్కొన్నారు.
Read: ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఆపలేదు…