గుండె ధైర్యం ఉంటే రాజకీయం చెయ్యొచ్చు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అనంతపురం జిల్లాలోని నల్ల చెరువులో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి వచ్చానని అన్నారు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా రాజకీయాల్లోనే ఉంటానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని అన్నారు. వైసీపీ నాయకులు తనకు శతృవులు కాదని, అద్భతమైన పాలన ఇచ్చి ఉంటే ఇలా రోడ్డు మీదకు వచ్చేవాడిని కాదని అన్నారు. పాలన బాగాలేదని, రోడ్లు అధ్వాన్నంగా తయారైయ్యాయని అన్నారు. పోలీసులకు కూడా డైలీ అలవెన్స్ ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కులానికి తాను వ్యతిరేకిని కాదని, ప్రత్యేక కారణాల వల్ల మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. రాయలసీమలో యువత ఉద్యోగం, చదువుల కోసం బయట ప్రాంతాలకు వెళ్లకుండా చేస్తానని అన్నారు. పుట్టపర్తి సాయిబాబా మంచినీటి పథకం పెట్టి గ్రామాలకు నీటి సరఫరా చేశారని, ప్రభుత్వాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న ఒక్క కియా పరిశ్రమను కూడా భయపెడుతున్నారని, రాయలసీమకు పరిశ్రమలు తెప్పిస్తానని, అభివృద్ధి చేసి చూపిస్తానని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అందరూ ఆనందంగా ఉండాలని, నాయకుడు నిజాయితీగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చేయవచ్చని అన్నారు.
Read: లైవ్: అనంతపురం జిల్లాలో పవన్ సభ
Also Read
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
తాజావార్తలు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?