NTV Telugu Site icon

Pawan Kalyan: సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

Bro (2)

Bro (2)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటే యూత్ కు పునకాలే.. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఇక ఏ రేంజులో హంగామా ఉంటుందో ఊహించుకోవచ్చు.. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ హీరోలుగా తెరకెక్కిన బ్రో ఈ నెల 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నుంచి విడుదలైన టీజర్‌, పాటలు ఇప్పటికే పై భారీ అంచనాలు పెంచేశాయి… ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇందులో థమన్‌ మ్యూజిక్‌ సిసిమాకు హైలెట్‌గా నిలిచింది. విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదిలో ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు పవన్‌తో పాటు సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌లు హాజరయ్యారు..

మెగా హీరోల స్పీచ్ లతో జనాలను తెగ ఆకట్టుకున్నారు.. వరుణ్ తేజ్ బాబాయ్ కష్టపడుతున్నారు అంటూ అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడారు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ తో స్టేజ్ మొత్తం దద్దరిల్లి పోయింది.. పవన్‌ మాట్లాడుతూ… ఇంత అభిమానం, ప్రేమ ఒక్కోసారి కలా, నిజమా అనిపిస్తుంది. ఇది నేను కోరుకున్న జీవితం కాదు, దేవుడు నాకు ఇచ్చిన జీవితం. చాలా చిన్న జీవితాన్ని గడపాలనుకున్నా, రాజకీయాల్లో కూడా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. అభిమానులపై నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. సమాజానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటాను. బ్రో ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చింది. కరోనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గారు నాకు ఫోన్‌ చేశారు. సముద్రఖని గారు చెప్పిన కథను విన్నాను బాగుంటుంది అన్నారు. అభిమానులను దృష్టిలో పెట్టుకొని నేను అభిమానులకు ఎలా నచ్చుతానే అలా నా పాత్రను డిజైన్‌ చేశారు అంటూ సినిమా పై హైప్ ను క్రియేట్ చేశారు..

ఇకపోతే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు..సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై స్పందించిన పవన్‌.. సాయి ధరమ్‌ తేజ్‌ ఈ రోజు ఇక్కడ ఉన్నాడంటే దానికి ఆ రోజు ప్రమాద సమయంలో కాపాడిన అబ్దుల్‌ కారణమని, అతనికి కృతజ్ఞతలు అంటూ పవన్‌ ఎమోషనల్ అయ్యారు. తేజ్‌ను బయటకు తీసుకొచ్చిన అపోలో, మెడికవర్‌ ఆసుపత్రి వర్గాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.. అంటూ పవన్ చెప్పడంతో స్టేజ్ మొత్తం పవర్ స్టార్ అని హోరేత్తింది.. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ మాట్లాడారు.. సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..