ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా పవన్ విషెస్ తెలియజేశారు. జగన్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ నేతలకు, పవన్ కళ్యాణ్ మధ్య వార్ జరుగుతున్న సమయంలో పవన్ స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు ఏపీ సీఎం జగన్‌కు సూపర్ స్టార్ మహేష్‌బాబు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని మహేష్‌బాబు ఆకాంక్షించాడు. జగన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
