NTV Telugu Site icon

పరిటాల శ్రీరామ్‌కు కరోనా పాజిటివ్‌..

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న వేళ సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ పరిటాల శ్రీరామ్‌కు కరోనా సోకినట్లు ఆయన వెల్లడించారు. అయితే స్వల్పలక్షణాలతో ఆయన కరోనా పాజిటివ్‌గా తేలిందని, ఇటీవల తనను కలిసివారందరూ జాగ్రత్తగా ఉండండని ఆయన తెలిపారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే.. కరోనా రక్కసి రెక్కలు చాస్తోంది. దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ విధించారు. ఏపీలో సైతం ఈ నెల 18 నుంచి నైట్‌ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లారు. వైసీపీ మంత్రి కోడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధాలు కూడా కరోనా రావడంతో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.