Site icon NTV Telugu

Sudan Fighting: సూడాన్ పోరులో 400 మంది మృతి.. 3,500 మందికి గాయం: WHO

Sudan Conflict

Sudan Conflict

ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైన్యం, పారామిలిటీరీ మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య పోరులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు దళాల పోరు తారాస్థాయికి చేరడంతో వందలాది మంది మరణించారు. ప్రస్తుత సూడాన్ వివాదంలో 413 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. సూడాన్ ప్రభుత్వం నుండి వచ్చిన గణాంకాల ప్రకారం 413 మంది ప్రజలు మరణించారు. దాదాపు 3,551 మంది గాయపడ్డారు. ఈ మేరకు WHO ప్రతినిధి మార్గరెట్ హారిస్ తెలిపారు. మృతుల్లో పిల్లలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కనీసం తొమ్మిది మంది పిల్లలు మరణించారి, సుమారు 50 మంది గాయపడినట్లు తమ వద్ద ఇప్పుడు నివేదికలు ఉన్నాయని వివరించారు. పోరాటం కొనసాగుతున్నంత కాలం ఆ సంఖ్యలు పెరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు.
Also Read:Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానే లక్ష్యం.. ఇమ్రాన్‌పై దాడికి ఉగ్రవాద సంస్థ ప్లాన్

అక్టోబర్ 2021 నుండి సుడాన్‌లో పని చేసే ప్రభుత్వం లేకుండా ఉంది. సైన్యం ప్రధానమంత్రి అబ్దల్లా హమ్‌డోక్ యొక్క ప్రభుత్వాన్ని తొలగించి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అనంతరం ఈ రెండు దళాలకు చెందిన నేతల మధ్య విభేదాలు ఈ సంక్షోభానికి కారణం అయ్యాయి. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య తీవ్ర విభేదాలు, ఈ రెండు భద్రతా బలగాల మధ్య సూడాన్ దేశం రావణకాష్టంగా మారింది. దేశ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భాగంగా పోరాటం జరుగుతోంది. రాజధాని ఖార్టూమ్, దాని పరిసరాలలో సూడాన్ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య గత శనివారం పోరు చెలరేగింది. దీంతో సూడాన్‌ లో పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు. విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీరు, మందులు దొరక్క అల్లాడిపోతున్నారు.
Also Read:Samanta : సమంతకు మ్యాథ్స్ లో 100, ఫిజిక్స్ లో 95, ఇంగ్లీషులో 90..

ప్రస్తుతం ప్రజలు భయానక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లలలో పోషకాహారలోపం ఎక్కువగా ఉన్న దేశాలలో సూడాన్ కూడా ఒకటి. దాదాపు 50,000 మంది పిల్లలకు కీలకమైన ప్రాణాలను రక్షించే పరిస్థితిని కలిగి ఉన్నామని UNICEF ప్రతినిధి చెప్పారు. సుడాన్‌లో హింస పెరగడానికి ముందు, దేశంలో పిల్లల మానవతా అవసరాలు ఎక్కువగా ఉన్నాయని, మూడొంతుల మంది పిల్లలు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని అంచనా వేసినట్లు ఎల్డర్ చెప్పారు. అదే సమయంలో 11.5 మిలియన్ల పిల్లలు, కమ్యూనిటీ సభ్యులకు అత్యవసర నీరు, పారిశుద్ధ్య సేవలు అవసరమవుతాయి. 7 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. 600,000 కంటే ఎక్కువ మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

Exit mobile version