NTV Telugu Site icon

MLA Muthireddy Yadagiri Reddy: ప్రజాక్షేత్రంలో ప్రత్యర్థులు బదానం చేస్తున్నారు.. ఇంటి సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారు..!

Muttireddy

Muttireddy

MLA Muthireddy Yadagiri Reddy: గతంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై తన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉన్న భూమి విషయంలో.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపణలు చేశారు. ఎకరం ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీసుకున్నారని కూతురు తుల్జా భవాని రెడ్డి తన తండ్రిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన సొంత కూతురే ఫిర్యాదు చేయడంతో అప్పుడా వివాదం సంచలనం రేపింది. అయితే ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి తను కూతురు పై స్పందించారు.

Read Also: Fake Facebook Account: ఫేసు‎బుక్‎లో అబ్బాయిగా మారిన అమ్మాయి.. నమ్మి మోసపోయిన యువతి

తనను ప్రజా క్షేత్రంలో బాదనం చేయాలన్న దానిపై ప్రత్యర్థుల చేస్తున్న కుట్రగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు ఇంటి సమస్యను బయటికి తీస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఆస్తుల సమస్య ఉంటుంది. కానీ.. ఇంటి సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో నేను కబ్జా చేశానని ఓ జిల్లా కలెక్టర్ అన్నారు. అయితే ఆ మాటలను తన నియోజకవర్గ ప్రజలు నమ్మ లేదని తెలిపారు.

Read Also: Wife Killed Husband: పార్టీలో గొడవైంది.. భర్తను చంపి ప్రియుడితో చెక్కేసింది

నేనేంటో.. నా ప్రవర్తన ఏంటో మా అధినేత సీఎంకు తెలుసన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబాలను వెలికితీస్తున్నారని.. తన అల్లుడు, బిడ్డను ఉసిగొల్పి బధనం చేసేందుకు కొందరు రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న కుట్రగా విమర్శించారు. అలా నన్ను బదనాం చేయాలని చేస్తే.. వారికి పిల్లలు ఉన్నారు. ఏదొక రోజు పాపం పండుతుందని.. ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా తనపై ఎవరైతే ఈ రాజకీయ కుట్రలు చేస్తున్నారో వాళ్ల ఆటలు సాగవు, నేనేంటో ప్రజలకు తెలుసు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసన్నారు. నా కట్టే ఇక్కడే కాలుతుంది, నా చితి బస్పం నియోజకవర్గంలోని 176 చెరువుల్లో కలపాలి, అప్పుడే తన ఆత్మ శాంతిస్తుంది అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు.