కరోనా మహమ్మారి సమయంలో అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. ఆంక్షలు విధించడంతో అన్ని రంగాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయి. కరోనా నుంచి కోలుకున్నాక విమానయాన రంగం మెల్లిగా పుంజుకున్నది. మొదట వందేభారత్ పేరుతో ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం విమానాలు నడిపారు. కేవలం 32 దేశాలకు మాత్రమే విమానాలు నడిపారు. దేశీయంగా కూడా కొన్ని విమానాలను నడిపారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వచ్చారు. 50 శాతం సీట్లతో కొన్నిరోజులు విమానాలు తిరిగాయి. ఆర్థికంగా ఇబ్బందే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో విమానాలు తిరిగాయి. ఆంక్షలు ఎత్తివేయడంతో విమానాల్లో ప్రయాణం చేసేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.
Read: లైవ్: శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
నవంబర్ నెలలో 1.05 కోట్ల మంది విమానాల్లో ప్రయాణం చేశారు. అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్ నెలలో 17.03 శాతం రద్దీ పెరిగింది. ఇండిగో విమానంలో 57.06 లక్షల మంది ప్రయాణం చేస్తే, స్పైస్‌జెట్ 10.78 లక్షల మంది ప్రయాణం చేశారు. ఎయిర్ ఇండియాలో 9.98 లక్షల మంది, గోఫస్ట్ లో 11.56 లక్షల మంది, విస్తారాలో 7.93 లక్షల మంది, ఎయిరేషియా ఇండియాలో 6.23 లక్షల మంది, అలియన్స్ ఎయిర్‌లో 1.23 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేశారు.
