ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రిస్క్ అధికంగా ఉన్న దేశాలనుంచి వచ్చే ప్రయాణికలపై కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఈరోజు అర్థరాత్రి నుంచి కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ భయంతో ఇండియాలో ఉన్న వివిధ దేశాల ప్రజలు తిగిరి సొంత దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో విమానం చార్జీలు భారీగా పెరిగాయి. ఢిల్లీ నుంచి యూకే, యూఎస్, బ్రిటన్, కెనడా రూట్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ రూట్‌లలో విమానం చార్జీలు రెండు మూడింతలు పెరిగాయి.
Read: వింటర్ ఒలింపిక్స్‌పై ఒమిక్రాన్ ప్రభావం…!!
సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి టోరంటో వెళ్లేందుకు విమానం చార్జీ రూ.80 వేల వరకు ఉంటుంది. అయితే, ఒమిక్రాన్ భయం కారణంగా ఈ రేటు రూ. 2.37 లక్షలు పెరిగింది. ఢిల్లీ నుంచి లండన్‌కు రూ. 60 వేలు ఉంటే ఇప్పుడు ఆ టికెట్ ధర రూ.1.22 లక్షలకు పెరిగింది. గతంలో ఢిల్లీ నుంచి యూఏఈ, యూఏఈ నుంచి ఢిల్లీకి రౌండ్ ట్రిప్ కు రూ. 20 వేలు ఉంటే ఇప్పుడు రూ. 33 వేలకు చేరింది. ఇండియా యూఎస్ మధ్యల రిటన్ టికెట్లు గతంలో రూ.90 వేల నుంచి 1.2 లక్షల వరకు ఉంటే ఇప్పుడు అవి రూ. 1.7 లక్షలకు చేరింది. బిజినెస్ క్లాస్ టికెట్ల ధరలు మరింతగా పెరిగాయి. ఢిల్లీ నుంచి చికాగో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ లకు బిజినెస్ క్లాస్ టికెట్ల ధరలు ఏకంగా 6 లక్షలకు చేరడం విశేషం.
