Site icon NTV Telugu

టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్‌ దాడి కలకలం సృష్టిస్తోంది… డ్రోన్‌ దాడులకు తమ పనేనని ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించగా.. ఈ డ్రోన్‌ దాడిలో మూడు అయిల్‌ ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు తెలిపారు.. అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లోని ఇంధనం వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు సమాచారం.

https://ntvtelugu.com/drone-attack-near-abu-dhabi-international-airport/

2.ఏపీ ఆరోగ్యమంత్రి ఆళ్ళ నాని తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయంతో రోడ్డు ప్రక్కన పడి ఉన్న బాధితుడిని ఆదుకున్నారు మంత్రి నాని. రోడ్ ఆక్సిడెంట్ లో విజయవాడ కొత్త బస్టాండ్ బెంజ్ సర్కిల్ మధ్యలో రోడ్ పక్కన పడి పోయాడు బాధితుడు శ్రీనివాస్ రెడ్డి. ఆ రూట్‌లో వెళుతున్న మంత్రి ఆళ్ళ నాని వెంటనే స్పందించారు.

https://ntvtelugu.com/ap-health-minister-allanani-humanity/

3.నల్లగొండలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా సాగుతోంది. అయితే మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశంలో కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఫ్లెక్సీపై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి ఎల్ అర్ ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు అభ్యంతరం తెలిపారు. దీంతో సీనియర్ నేత జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడారు.

https://ntvtelugu.com/miryalaguda-congress-membership-drive-controversy/

4.పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం.. వివిధ రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు రావడంతో.. ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈసీ ప్రకటించింది.. ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రధాన కారణం మాత్రం.. రవిదాస్‌ జయంతియే కారణంగా చెబుతున్నారు.. ఫిబ్రవరి 16వ తేదీన రవిదాస్ జయంతి ఉండగా.. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది.

https://ntvtelugu.com/punjab-assembly-election-2022-polling-date-rescheduled/

5.టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫిట్ నెస్ ఫ్రీక్ అందరికి తెలిసిందే. ఆమె అంత అందంగా ఉండటానికి కారణం నిత్యం రష్మిక జిమ్ లు, యోగాలు చేస్తుండటమే.. అయితే జిమ్ లో అమ్మడు ఎంత కష్టపడుతుందో ఆమె అప్పుడప్పుడు పెట్టె వీడియోలు చూస్తే తెలుస్తోంది. ఇక ఆమె ట్రైనర్ కులదీప్ సేథీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

https://ntvtelugu.com/rashmika-mandanna-shares-her-gym-trainer-video/

6.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది… వరుసగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులకు కూడా కరోనా సోకుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు పొలిటికల్ లీడర్లు, అధికారులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కోవిడ్ సోకింది.. ట్విట్టర్‌ ద్వారా స్వయంగా ఈ విషయాన్ని నారా లోకేష్‌ వెల్లడించారు..

https://ntvtelugu.com/nara-lokesh-tested-positive-for-covid-19/

7.ఏపీ సీఐడీ పోలీసులకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఇటీవల ఏపీసీఐడీ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. గతంలో నమోదైన కేసుల్లో విచారణకు రావాలని ఈనెల 12న హైదరాబాద్‌లో తన నివాసంలో సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారని… అందులో ఈనెల 17న విచారణకు రావాలని సూచించారన్నారు. అయితే తాను అత్యవసర పని మీద ఢిల్లీకి వచ్చానని…

https://ntvtelugu.com/narsapuram-mp-raghurama-not-attended-to-cid-enquiry/

8.తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి మీడియా ముందుకు రానున్నారు.. కరోనా సమయంలో కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెడుతున్నారంటే.. ఆయన ఏం చెబుతారు..? ఎలాంటి ఆంక్షలు పెడతారు..? కేసుల పరిస్థితి ఏంటి? అనేదానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూసేవారు.. ఇప్పుడు మళ్లీ కోవిడ్‌ విజృంభిస్తోంది.. ఓవైపు ఒమిక్రాన్‌.. మరోవైపు డెల్టా కేసులు వరుసగా పెరుగుతూ పోతున్నాయి.. ఈ నేపథ్యంలో.. కోవిడ్‌ తాజా పరిస్థితి,

https://ntvtelugu.com/telangana-cm-kcr-will-press-conference-after-cabinet-meeting/

9.ఐర్లాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ గడ్డపై ఆశ్చర్యకర రీతిలో వన్డే సిరీస్ విజయాన్ని సాధించింది. సబీనా పార్కులో ఆదివారం రాత్రి జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌పై రెండు వికెట్ల తేడాతో ఐర్లాండ్ గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో వెస్టిండీస్ గెలవగా… రెండు, మూడు వన్డేల్లో ఐర్లాండ్ గెలిచి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా విదేశీ గడ్డపై తొలిసారి ఐర్లాండ్ వన్డే సిరీస్ గెలిచింది.

https://ntvtelugu.com/ireland-cricket-team-creates-history-in-west-indies-tour/

10.ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పుష్ప’ ఐటెం సాంగ్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత, అల్లు అర్జున్ మాస్ స్టెప్పులతో అలరించిన ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ పాటకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా డాన్స్ లతో ఈ సాంగ్ ని ఊపేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు ఈ సాంగ్ కి చిందులు వేసి మెప్పించగా….

https://ntvtelugu.com/actor-pragathi-instagram-video-viral/
Exit mobile version