1.ఈ ఏడాది ప్రధమార్థంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. మార్చితో గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు పాలనా కాలం ముగియనుండగా, మే నెలతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల పాలనా కాలం ముగియనున్నది. కరోనా తీవ్రత కారణంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఆరోగ్యశాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్టు సీఈసీ పేర్కొంది.
2.ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తున్నట్టు ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. జనవరి 14 వ తేదీన యూపీలో తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఈసీ తెలిపింది.
3.‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకుమార్ ..ప్రస్తుతం ‘పుష్ప’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్ ని ముగించుకున్న సుకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పేవరెట్ డైరెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . సుకుమార్ కి నచ్చిన డైరెక్టర్ మణిరత్నం అని ఆయన చాలా స్టేజిలపై చెప్పారు. ఆయన సినిమాలను చూసే దర్శకత్వం వైపు వచ్చినట్లు కూడా తెలిపారు.
4.తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇతోధికంగా సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా నిధులు ఇస్తోంది. రైతుల ఆత్మ బంధువుగా చేపట్టిన రైతు బంధు పథకం విజయవంతంగా అమలు అవుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 63 లక్షల తెలంగాణ రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. దీంతో వ్యవసాయం కోసం అప్సులు తెచ్చుకునే బాధ చాలామటుకు తప్పుతోంది.
5.ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఓ టైమ్ లైనులో ప్రకటిస్తాం.. పరిష్కరిస్తామని సీఎం చెప్పారని జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల్లో కొంత మేర మిశ్రమ స్పందన వచ్చిందని, అయినా ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి టైమ్ బౌండ్ పెట్టడం సంతోషమన్నారు.
6.హైదరాబాద్‌లో క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్యం అందించడంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. బసవతారకం ఆసుపత్రిలో ఇవాళ 21 బెడ్స్ తో ఒక అధునాతన డేకేర్ వార్డ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా వుందన్నారు. 100 పడకల ఆసుపత్రిగా మొదలైన ఈ ప్రస్థానం ఈ రోజు 650 పడకలుగా అభివృద్ధి చెందడం… అనేక అధునాతన సౌకర్యాలను సమకూర్చుకోవడం చాలా సంతోషంగా వుందన్నారు సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
7.కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా తమిళనాడులో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆదివారం రోజున సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, కరోనా కట్టడికి సదరన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. చెన్నై లోకల్ రైళ్లలో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోని వారిని రైళ్లలోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
8.దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వారంటైన్ మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఢిల్లీలో వీకెంట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు.
9.చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ రోజు శెట్టిపల్లె గ్రామ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. రామకుప్పం మండలం శివాజీ నగర్‌లో అంబేద్కర్ విగ్రహ వివాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంగా ఉండే వ్యక్తి చేపల మార్కెట్ గురించి మాట్లాడుతారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
10.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘వాక్సినేషన్ చేయించుకున్నప్పటికీ నాకు కరోనా వచ్చింది. దానికి సంబంధించిన తేలికపాటి లక్షణాలు నాకు ఉన్నాయి’ అని ‘పేజీ 3’ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెలిపారు.
