మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆశాభావంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి.. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకం. కుటుంబ అవసరాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు, వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి.
వృషభం : ఈ రోజు ఈ రాశివారి బ్యాంకు పనులు, కార్యకలాపాలు మందకొడిగాసాగుతాయి. వ్యాపార వర్గాలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మిమ్ములను కలవరపరిచిన సంఘటనతేలికగా సమసిపోతుంది.
మిధునం : ఈ రోజు ఈ రాశిలోని ట్రాన్సర్లు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. బంధు మిత్రులముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు ఒక పుణ్యక్షేత్నాన్ని సందర్శించే అవకాశం ఉంది.. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మిత్రుల సహాయంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. ఇతరులకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
కన్య : ఈ రోజు ఈ రాశివారు గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఋణం ఏ కొంతైనా తీర్చటానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. బంధువులరాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది.
తుల : ఈ రోజు ఈ రాశిలోని ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతుంది. స్త్రీలు షాపింగ్ కోసం ధనం ఖర్చుచేస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్త్రీలకు టీవీ చానెళ్ల కార్యక్రమంలో అవకాశం లభిస్తుంది. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని హోటల్, కేటరింగ్ రంగాలవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. రావలసిన ధనం ఆలస్యంగా అందటం వల్ల ఒడిదుడుకులు తప్పవు. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు.
మకరం : ఈ రోజు ఈ రాశివారు ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలు పనివారల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలలో పరిచయాలేర్పడతాయి. లౌక్యం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించటం వల్ల కొన్ని సమస్పలు పరిష్కారమవుతాయి.
కుంభం : ఈ రోజు మీకు కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. పాత మిత్రులను కలుసుకుంటారు.
మీనం : ఈ రోజు మీ బంధువుల రాకవల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. రవాణా రంగంలో వారికి సంతృప్తి. సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి.