ఆగస్టు 10, మంగళవారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు తమ సంతానానికి స్థోమతకు మించిన వాగ్ధానాల ఇవ్వడం వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి.
వృషభం : ఈ రోజు మీరు పాతవస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. బంధు మిత్రుల నుంచి ధన సహాయ విషయంపై ఒత్తిడి, మొహమ్మాటాలు అధికంగా ఉంటాయి.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
మిథునం : ఈ రోజు ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరుల మధ్య ఒక అవగాహన ఏర్పడుంది. ఉద్యోగస్తులకు అందిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ధనం ఇతరులకు ఇచ్చినా తిరిగి రాజాలదు.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారికి ఆశాజనకంగా ఉంటుంది… శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో మెళకువ వహించండి. దంపతులు ప్రతి విషయంలోనూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు.
సింహం : ఈ రోజు మీరు ఆదాయానికి మించిన ఖర్చులు వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. మార్కెటింగ్ రంగాల వారికి యాజమాన్యం నుంచి అనుక్షణం వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా ఎదుర్కొంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఆకస్మికంగా ప్రయాణాలు సందర్శిస్తారు. వీలైనంత తక్కువగా మాట్లాడి ఎదుటివారి నుంచి సమాచారం రాబట్టేందుకు యత్నించండి.
తుల : ఈరోజు ఈ రాశిలోని విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు విలాస వస్తువులు, ఆడంబరాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్త్ర, బంగారం వ్యాపారులకు సామాన్యం. క్రయ విక్రయాలు మందకొడిగా ఉంటాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు తలకిందులవుతాయి. హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం వుంది. వ్యవసాయ కూలీలకు ఆశాజజనకం.
ధనస్సు : ఈ రోజు మీకు రావలసిన ధనం చేతికందుతుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలు ఉంటాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రతి విషయంలోనూ ఏకాగ్రత ముఖ్యం.
మకరం : ఈ రోజు మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ మాటకు కుటుంబంలోను, సంఘంలోనూ వ్యతిరేకత ఎదురవుతుంది. ఉద్యోగస్తులకు వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి.
కుంభం : ఈ రాశివారి గృహ నిర్మాణాల్లో వ్యయం అంచనాలను మించుతుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారల శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. స్త్రీలకు ఖరీదైన వస్తు కొనుగోళ్ళలో ఏకాగ్రత అవసరం. సమయానుకూలంగా మీ ఆహారపు అలవాట్లు, పద్దతులు మార్చుకోవలసి రావొచ్చు.
మీనం : ఈ రాశివారు స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పాతమిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!