NTV Telugu Site icon

NTR: రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు.. తారక్ కళ్ళల్లో నీళ్లు

Ntr

Ntr

దేశవ్యాప్తంగా దుమ్ములేపిన నాటు నాటు ఆస్కార్ సాధించింది. దీంతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆస్కార్ లో నాటు నాటు పాట తో ఊపు వచ్చింది. ఆస్కార్ వేదిక పైన ఈ పాటకు డాన్స్ చేశారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించింది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, తొలి భారతీయ సినిమా పాటగా ‘నాటు నాటు’ చరిత్ర సృష్టించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ తోపాటు మూవీ టీమ్ సర్వత్ర అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, అమెరిక పర్యటన ముగించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు.
Also Read:Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం.. ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి

ఈ సందర్భంగా మాట్లాడిన తారక్.. నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిందని అనౌన్స్ చేసిన క్షణంలో ఆనందం తట్టుకోలేకపోయనని అన్నారు. ఆస్కార్ వేదిక మీద ట్రిపుల్ ఆర్ టీం చేతికి ఆస్కార్ అందించినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదనిపించిందని చెప్పారు. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన అభిమానులకి, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు తారక్. రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయని చెప్పారు. అవార్డు వచ్చిన విషయం న ఫ్యామిలీ లో మొదటగా తన వైఫ్ కి కాల్ చేసి షేర్ చేసుకున్నానని చెప్పారు.

ఇక, ట్రిపులార్ సినిమాకి ఆస్కార్ రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని నాటు నాటు పాటకు డ్యాన్స్ మాస్టర్ వ్యవహరించిన ప్రేమ్ రక్షిత్. మొదటగా తనకు వీసా రాలేదన్నారు. రాజమౌళి చాలా ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే, కేవలం ఐదు రోజులకు మాత్రమే వీసా ఇచ్చారని దీంతో పదో తేదీన అమెరికా వెళ్లానని చెప్పారు. స్టేజ్ మీద నాటు నాటు పాటకి పెర్ఫామ్ చేయటం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నారని ప్రేమ్ రక్షిత్ చెప్పారు. తాను కంపోజ్ చేసిన స్టెప్స్ ఆస్కార్ స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తుంటే ఆనందం మాటల్లో చెప్ప లేనిదని సంతోషం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంతో హార్డ్ వర్క్ చేశారన్న ఆయన.. రాజమౌళితో తన జర్నీ చెప్పడం కష్టం, అదో పెద్ద సిరీస్ లాంటిదన్నారు. తన పాటకి ఆస్కార్ వచ్చింది అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని చెప్పారు. తన లైఫ్ లో మొదటిసారిగా ఒక పాట కోసం రెండు నెలలు హార్డ్ వర్క్ చేశానని తెలిపారు.
Also Read:Pawan Kalyan: రెండుచోట్ల ఓడిపోయినా.. నన్ను నడిపించింది మీరే

కాగా, ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. 95 వ అకాడమీ అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. నాటు నాటు మ్యాజిక్ డైరెక్టర్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డులు అందుకున్నారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాట… ఆస్కార్‌కి దక్కించుకోవడం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు.

Show comments