హుజూరాబాద్ లో ముగిసిన కీలక ఘట్టం.. అసలు పోరు షూరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కీలకఘట్టం నేడు ముగిసింది. నేడు నామినేషన్ల చివరి రోజు కావడంతో ఆర్డీవో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేసిన కొద్దిసేపటికే నామినేషన్ల గడువు ముగిసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో ఓ అంకానికి తెరపడింది. ఈనెల 11న స్క్రూటిని జరగనుండగా, 13న ఉపసంహరణ గడువు ఉండటంతో ఎవరెవరు పోటీలో ఉంటారనేది మరింత క్లారిటీ రానుంది.
నేడు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ ఉన్నారు. వీరిద్దరు కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేశారు. వీరితోపాటు నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే మొత్తంగా 26మంది అభ్యర్థులే మాత్రమే నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం అందుతోంది. కరోనా నిబంధనలు, ఇతరత్రా కారణాలతో పోలీసులు నామినేషన్ కేంద్రాలకు గుంపులుగా వచ్చిన వారిని అడ్డుకొని తిరిగి పంపించారు.
Also Read
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
దీంతో పోలీసులకు అభ్యర్థులకు మధ్య స్పల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసుల తీరును ఖండిస్తూ పలువురు అభ్యర్థులు నామినేషన్ సెంటర్ వద్ద ఆందోళనలు చేపట్టారు. అయితే పోలీసులకు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ కారణంగా నామినేషన్లు ఎక్కువగా నమోదు కాలేదనే టాక్ విన్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు స్వత్రంత్ర అభ్యర్థులు మాత్రం నేడు నామినేషన్లు దాఖలు చేశారు.
మొత్తానికి నేడు నామినేషన్ల ప్రక్రియ సజావుగానే ముగిసిందని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. నేడు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా టీఆర్ఎస్ నుంచి ఇటీవలే గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఆయన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇక చివరిరోజు నామినేషన్లు దాఖలు చేసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల ముఖ్యనేతలు వచ్చారు. దీంతో నామినేషన్ సెంటర్ల వద్ద పెద్దఎత్తున కోలాహలం కన్పించింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రక్రియలో ఓ కీలక ఘట్టం ముగియడంతో అసలు యుద్ధానికి తెరలేచింది. పోలింగ్ తేదికి మరో 20రోజులే ఉండటంతో అభ్యర్థులంతా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. ఓటర్లను ఆకర్షించేలా హామీలు, తాయిళాలు ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ ఎన్నిక పోరును టీఆర్ఎస్, బీజేపీ ఛాలెంజ్ తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ సైతం పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఏదిఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి మాత్రం అందరిలోనూ నెలకొంది.
తాజావార్తలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!