రాస్తారోకోలు, ధర్నాలు కొత్త కాదు.. ఈ మధ్య.. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో పోటీపోటీ ఆందోళను నడుస్తున్నాయి.. అయితే, కేంద్రంపై చేస్తున్న పోరాటంలో భాగంగా తెలంగాణలో నేడు చేపట్టిన, రేపు చేపట్టబోతున్న టీఆర్ఎస్ రాస్తారోకో, ధర్నాలపై హైకోర్టులో విచారణ జరిగింది… అనుమతి లేకుండా టీఆర్ఎస్ ఆందోళన చేస్తోందంటూ కాకతీయ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ పిటిషన్ దాఖలైంది.. దానిపై విచారణ చేపట్టింది హైకోర్టు.. ధర్నాలతో ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతోందని పిటిషన్ పేర్కొన్నారు… అయితే, టీఆర్ఎస్ ఆందోళనలకు అనుమతి ఉందా? అంటూ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ఇక, హైకోర్టుకు సమాధానమిచ్చిన హోంశాఖ.. రాస్తారోకోలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది..
Read Also: Telangana: బడుల పనివేళలు మళ్లీ పెంపు..
అంతేకాదు, తమ దృష్టికి వచ్చిన వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు వివరించిది తెలంగాణ హోం శాఖ.. అయితే, ఏం చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలకు అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.. అనుమతి లేని ఆందోళనలను అడ్డుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.. ఇక, తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
